యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి ఫ్రాన్సెస్ టియాఫో ప్రవేశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫో అద్భుత పోరాటంతో సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. అలెక్స్ మిచెల్సెన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తొలి రెండు సెట్లు కోల్పోయిన టియాఫో, అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. దాదాపు 4 గంటల 38 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు.