నేరన్యాయ వ్యవస్థలో బాధితుల విస్మరణపై సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ ఆందోళన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బీహార్

నేరన్యాయ ప్రక్రియలో నిందితులపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని, బాధితులు మాత్రం వాంగ్మూలం ఇచ్చిన తర్వాత విస్మరణకు గురవుతున్నారని భారత ప్రధాన సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలో బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, న్యాయ వ్యవస్థ బాధితులకు మానసికంగా రెండో గాయంగా మారుతోందని పేర్కొన్నారు. పరిహారం, న్యాయ, వైద్య సహాయం వంటి అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కేంద్రం దోహదపడుతుందని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.