ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు: రేపు ఘనంగా పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
తెలంగాణ ఆర్టీసీలో పదేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు రేపు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని వందకుపైగా డిపోలు, గ్యారేజీల్లో నూట ఇరవైకి పైగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. బరిలో పన్నెండు సంఘాలు నిలవగా ముప్పై ఐదు వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.