వైకాపా వీడుదలపై కంటతడి పెట్టిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పార్టీ వీడి తెదేపాలో చేరడంపై ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. పక్కనే ఉన్న కుమార్తె ఆయనను ఓదార్చారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వ్యక్తులు వస్తారు పోతారు కానీ పార్టీ శాశ్వతమని బొత్స స్పష్టం చేశారు.