చెన్నైలో వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
చెన్నైలోని అళపాక్కంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో పూంగుడి ఇంటికి వెళ్లిన జైశంకర్ అనే వెల్డర్పై దామోదరన్ అనే వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన జైశంకర్ రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి పూంగుడి, దామోదరన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.