'తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలి': ఇచ్చోడలో భాజపా డిమాండ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆదిలాబాద్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని నాయకులు కోరారు. రమేష్, కొల్లూరి శేఖర్, కదం బాపురావు, భీమ్ రెడ్డి, పేందూరు తులసిరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.