విజయనగరం జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యంపై అధికారులపై కలెక్టర్ వేటు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో వరద విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. వంగర తహశీల్దార్ రామారావుతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన విచారణ చేపట్టి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నిర్ణయంతో అధికార వర్గాల్లో కలవరం మొదలైంది.