విజయనగరం జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ కఠినతరం: సెన్సార్ పరీక్షలతో చుక్కలు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ కఠినతరమైందని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ తెలిపారు. గడువు ముగిసిన తర్వాత లైసెన్స్‌ల రెన్యువల్‌కు వస్తున్న వాహనదారులు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ పూర్తిచేసుకొని సెన్సార్ డ్రైవింగ్ పరీక్షలను ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. పూర్తిగా డ్రైవింగ్ వస్తేనే సాంకేతిక వ్యవస్థ ద్వారా లైసెన్స్ జారీ చేస్తామని, రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోందని ఆయన వివరించారు.