పాకిస్థాన్లో మూడేండ్ల బాలికకు అరవై ఏండ్ల వృద్ధుడితో పెళ్లి

రిపోర్టర్: మహేష్ స్థలం: Balochistan

పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో మూడేండ్ల బాలికకు అరవై ఏండ్ల వృద్ధుడితో వివాహం చేయడం తీవ్ర కలకలం రేపిందని అధికారులు తెలిపారు. రూ. 25 లక్షల కరెన్సీ కోసం బాలిక తండ్రి అబ్దుల్ బాకీ ఈ వివాహం కుదిర్చినట్లు ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వరుడు సలాహుద్దీన్ పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వధువు ధర చెల్లించకపోవడంతో ఈ వివాహం ప్రస్తుతం కాగితాలకే పరిమితమైనట్లు సమాచారం. ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.