జహీరాబాద్లో కాంట్రాక్టర్ విశ్వనాథం మృతిపై ఎంపీ సురేష్ పరామర్శ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
జహీరాబాద్ పట్టణానికి చెందిన మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్ విశ్వనాథం అకాల మరణం చెందడం పట్ల ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి చేరుకున్న ఎంపీ, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ తన్విర్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొని నివాళులర్పించారు. విశ్వనాథం మృతి జహీరాబాద్ పట్టణానికి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.