గణనాధుని సన్నిధిలో పులకించిన ముగ్గుల పోటీల శోభ
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బద్దురోలు గ్రామంలో బీసీ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయకుని మండపం వద్ద ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు వంద మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. గెలుపొందిన విజేతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు, మహిళలకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.