క్రీడాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానన్న బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

చందనగర్లోని పీజేఆర్ స్టేడియంలో నాలుగు రోజుల క్రీడా సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు అట్టేపల్లి రామప్రభు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 మంది పీఈటీ ఉపాధ్యాయులకు ట్రస్ట్ తరఫున టీ-షర్టులు, క్యాప్స్ అందజేసి, క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు.