పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛతాహీసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐకార్ వెల్లడి

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులను పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు ఐకార్ ఇండియా వెల్లడించింది. సిక్కింలో వర్మీకంపోస్టింగ్ నుండి మేఘాలయలో గ్రామీణ పరిశుభ్రత వరకు యువత మార్పునకు నాంది పలుకుతోందని తెలిపింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు పేర్కొంది.