భారీ ఊరట: కోస్తాంధ్రలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలమట్టాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా కోస్తాంధ్రలో భూగర్భ జలమట్టాలు సగటున 1.14 మీటర్ల మేర పెరిగినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు తెలిపారు. గతంలో ఎల్ నినో పరిస్థితుల వల్ల తీవ్ర లోటు వర్షపాతం నమోదై జలాలు అడుగంటిపోగా, తాజా వర్షాలతో అనేక జిల్లాల్ లో పరిస్థితి మెరుగైందని, ఏలూరులో అత్యధికంగా రెండు మీటర్లకు పైగా నీటిమట్టం పెరిగిందని తెలిపారు.