వినాయక చవితి వేడుకలపై పోలీసు అధికారుల కీలక ఆదేశాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణకు ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందాలని, ప్రతిమల ఏర్పాటు స్థానం, నిమజ్జన మార్గాలపై స్పష్టమైన వివరాలు అందించాలని కోరారు. ఎస్పీ మరియు డీఎస్పీ ఆదేశాల మేరకు కమిటీలు నిబంధనలు పాటించాలని, డీజేలు మరియు ఇతర అంశాలపై పోలీసుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రమణయ్య,, కానిస్టేబుల్ వారి సిబ్బంది తదితరులు అందరు పాల్గొన్నారు