శ్రీ చైతన్య పాఠశాలలో భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్లో వినాయక పూజా కార్యక్రమాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాల ఏజీఎం ఎం. వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శ్వేతా బాన్స్, కోఆర్డినేటర్లు రఘువంశీ, కామేశ్వరి, ప్రీతి, జోనల్ పీఈటీ వి. అయోధ్య విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల ప్రగతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.