కార్పొరేట్ కాలేజీ కక్కుర్తి: ఫీజుల వేధింపులతో చెంచు విద్యార్థిని చదువు అర్ధాంతం
రిపోర్టర్: కిరణ్
స్థలం: నాగర్కర్నూల్
కార్పొరేట్ కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా ఓ చెంచు బాలిక విద్యా సంవత్సరం వృథా అయిందని ఆర్డీటీ సంస్థ అధికారులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన చెంచు వెన్నెల హైదరాబాద్ లో ఇంటర్ పూర్తి చేసింది. కేవలం ఆరు వేల రూపాయల బకాయి పేరుతో యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చేసేదేమీలేక అడవి బాట పట్టిన ఆ అభాగ్యురాలు చీపురుపుల్లల సేకరణలో నిమగ్నమైందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.