విజయవాడలో రాష్ట్ర తొలి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభం

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో సైబర్ నేరాలను అణచివేసేందుకు విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ తొలి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌ను డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రారంభించారు. ఫిర్యాదు అందగానే గోల్డెన్ అవర్‌లో నిందితుల ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఈ మోడల్‌ను విస్తరిస్తామని, ప్రతి జిల్లాకు 20 మంది ప్రత్యేక సైబర్ నిపుణులను కేటాయిస్తామని వెల్లడించారు.