'మోదీ జన్మదినాన ఆశీర్వాద దీపం వెలిగిద్దాం': BJP ఆంధ్రప్రదేశ్

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోరుకుంటూ ఆయన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఒక్కరి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగించాలని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ పిలుపునిచ్చినట్లు BJP ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ఈ వేడుకలో పాల్గొని ప్రధానికి దీవెనలు అందించాలని BJP ఆంధ్రప్రదేశ్ కోరింది.