బాక్సాఫీస్ వద్ద డీలా పడిన కార్తి 'సర్ధార్ 2' కలెక్షన్లు
రిపోర్టర్: శివ
స్థలం: India
తమిళ స్టార్ హీరో కార్తి నటించిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్ధార్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించడంతో కలెక్షన్లు రోజురోజుకూ పడిపోతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్ సినిమా కార్తి కెరీర్లో నిరాశపరిచిన చిత్రాల జాబితాలో చేరేలా కనిపిస్తోంది.