పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఈ ఫిర్యాదు చేసే కియోస్క్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ప్రజలు ఫిర్యాదు చేసే వినూత్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ-ఫిర్యాదు కియోస్క్ను శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో కలిసి ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలపై పోలీసుల సహాయం లేకుండానే ఈ కియోస్క్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇక్కడ నమోదైన ఫిర్యాదులను పీజీఆర్ఎస్తో అనుసంధానం చేశామని వెల్లడించారు.