రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి: విశాఖ వెళ్తుండగా ఘోర విషాదం
రిపోర్టర్: కిరణ్
స్థలం: గజపతినగరం
విశాఖకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట్యాడ రోహిత్ కుమార్ మృతి చెందారని గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన రోహిత్ కుమార్ బుధవారం తెల్లవారుజామున మరుపల్లి వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొన్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.