వైఎస్ జగన్ సొంత గడ్డపై సునీతారెడ్డితో కూటమి మాస్టర్ ప్లాన్
రిపోర్టర్: హరి
స్థలం: కడప
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సొంత గడ్డపైనే దెబ్బకొట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డిని రంగంలోకి దించేందుకు మంత్రి నారా లోకేశ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ సొంత మండలమైన కడప జిల్లా లింగాలలో జెడ్పీటీసీగా పోటీ చేయాలని, గెలిస్తే జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పోస్టు ఇస్తామని ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.