విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఫోరం ఏర్పాటు: ఏడీఈ నవీన్ కుమార్
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబ్ నగర్
విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేసినట్లు ఏడీఈ నవీన్ కుమార్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ లోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా, బిల్లులు, మీటర్ల సమస్యలు మరియు ఇతర ఫిర్యాదులను ఈ ఫోరం ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫోరం సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఏఈలు వెంకటేష్, అఖిల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.