కొండగట్టు అంజన్న ఆలయంలో అరుదైన ఘట్టం: అరవై ఏళ్ల తర్వాత అపూర్వ చందనోత్సవం
రిపోర్టర్: సురేష్
స్థలం: జగిత్యాల
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో అరవై ఏళ్ల తర్వాత అరుదైన చందనోత్సవం నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. మల్యాల మండలం లోని ఈ ఆలయంలో నవంబరు పదహారు నుంచి ఇరవై వరకు ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. మూలవిరాట్ పై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పించనున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించనున్నట్లు విశ్రాంత స్థానాచార్యులు తిరుక్కోవెల మారుతి వెల్లడించారు. ఈ వేడుకల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.