యువ పారిశ్రామికవేత్త దీప్తిరెడ్డి మృతిపై సీపీ సజ్జనార్ దిగ్భ్రాంతి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన యువ మహిళా పారిశ్రామికవేత్త మడుగుల దీప్తిరెడ్డి బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత బాధాకరమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబం అవయవదానం చేయడం సమాజానికి ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు. బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతూ శనివారం రాత్రి దీప్తిరెడ్డి కన్నుమూశారు. ఆమె భర్త, సినీ దర్శకుడు ప్రదీప్ రెడ్డి తీసుకున్న మహోన్నత నిర్ణయంతో నలుగురి ప్రాణాలు నిలిచాయని సజ్జనార్ ప్రశంసించారు.