సిరికొండలో 25 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిరికొండ
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు MPDO కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి రాములు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 25 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించనున్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ పురస్కారాలు ఉపాధ్యాయులలో స్ఫూర్తిని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.