'టికెట్లు, పదవుల కోసం ఎంతమంది మతం మార్చుకున్నారు?': విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సొంత పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపాలో గతంలో ఎంతమంది నాయకులు ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రైస్తవ సభలో మాట్లాడిన పాత వీడియోను జత చేయడంతో ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.