విజయవాడ బస్ స్టాండ్‌లో కలకలం రేపిన జిలెటిన్ స్టిక్స్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్‌లో ప్రయాణం సమయంలో లగేజీ బ్యాగులు తారుమారవ్వడంతో భారీ పేలుడు పదార్థాలు వెలుగుచూశాయి. నరసరావుపేట నుంచి వచ్చిన ప్రయాణికుడి బ్యాగులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు లభించడంతో ఆఫ్రిక్ ఆలి పోలీసులను ఆశ్రయించాడు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి బ్యాగ్ ఎవరిదనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.