హైదరాబాద్లో నూతన బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు ప్రభుత్వ కసరత్తు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనుంది. శంషాబాద్, ఎల్బీనగర్, గాజులరామారం, ఘట్కేసర్లలో టెర్మినల్స్ నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దూరప్రాంత బస్సులను నగరంలోకి రాకుండా నిలిపివేయడంతో పాటు, మెట్రో మరియు సిటీ బస్సులతో కనెక్టివిటీ కల్పిస్తామని, త్వరలో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు.