పోషణ మాసంలో అంగన్వాడీ సేవలు అభినందనీయమన్న సర్పంచ్ విజయలక్ష్మి

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన 9వ పోషణ మాసం మన అంగన్వాడీ-మన బాధ్యత మండల స్థాయి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ టీచర్ల సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ పారిజాత, సూపరివైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.