'ప్రజల సమస్యల పరిష్కారమే మా మొదటి ప్రాధాన్యత': రాజమండ్రిలో నేతల ప్రజా గ్రీవెన్స్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Rajahmundry
రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు స్వయంగా విన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమని నేతలు స్పష్టం చేశారు.