హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు భారత్, చైనాకు మినహాయింపునిచ్చిన ఇరాన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: టెహ్రాన్

అంతర్జాతీయ చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఆంక్షల నడుమ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మిత్ర దేశాలైన భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలకు ఈ జలసంధిలో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ స్పష్టం చేశారు. మిగిలిన దేశాలపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.