రాజకీయ సంచలనం: మా దగ్గర డబ్బులు కూడా లేవంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Guntur

గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓటమి పాలైందని, ప్రస్తుతం తమ దగ్గర డబ్బులు కూడా లేవని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితిని ఓటర్లు అర్థం చేసుకుని మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలకు తావులేకుండా ఆర్గానిక్ పద్ధతిలో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.