ప్రధాని మోదీ ప్రజాసేవకు మద్దతుగా ఆశీస్సుల దీపం కార్యక్రమం

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాతికేళ్ల ప్రజాసేవకు మద్దతుగా ఆశీస్సుల దీపం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వయంగా దీపాలు వెలిగించి ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు, నేతలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు.