కర్ణాటకలో అటవీశాఖ అధికారులపై చిరుత దాడి తీవ్ర కలకలం
రిపోర్టర్: సతీష్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలోని దావణగెరె సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలువలో పడిన చిరుతను రక్షించేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై ఆ మృగమే తిరగబడింది. చికిత్స కోసం మత్తుమందు ఇస్తుండగా ఒక్కసారిగా అధికారులపై దాడికి దిగింది. ఈ ఘటనలో అటవీశాఖ ఉద్యోగి మరుళసిద్ధప్ప తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది చిరుతను కట్టడి చేసి సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు.