సంజు సామ్సన్ కే భారత్ టీ20 ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలి: రహానె
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
భారత టీ20 జట్టులో సంజు సామ్సన్కు మరో అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ అజింక్యా రహానె అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ గెలిచిన ఓపెనింగ్ కాంబినేషన్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్లతోనే కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. వైభవ్ సూర్యవంశీకి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని, ప్రస్తుతం అతడు తన సహజ ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించారు.