ఉద్యోగ నియామకాలే కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉద్యోగ నియామకాలే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో భర్తీ కాని పోస్టులను భర్తీ చేస్తూ పోలీస్, డీఎస్సీ, గ్రూప్-1 నియామకాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తాజాగా డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని, త్వరలోనే 3,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.