డిగ్రీ కాలేజీ లెక్చరర్, లైబ్రేరియన్ నోటిఫికేషన్ రద్దు చేసిన టీజీపీఎస్సీ
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఉద్యోగార్థులకు టీజీపీఎస్సీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో ఇచ్చిన పాత నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసింది. నూతన రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.