స్థానిక సంస్థల ఎన్నికలు: భారీగా తిరస్కరణకు గురైన నామినేషన్లు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
రాష్ట్రంలో వివిధ పార్టీల తరఫున దాఖలైన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ నామినేషన్లలో భారీగా తిరస్కరణలు చోటుచేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎంపీటీసీ, ఆరు వందల యాభై తొమ్మిది జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు నామినేషన్లు దాఖలు కాగా, ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎంపీటీసీ మరియు తొమ్మిది వందల యాభై నాలుగు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని అధికారులు తెలిపారు.