మౌలిక సమస్యలు పక్కన పెట్టి టూరిజం హోటలా?

రిపోర్టర్: హరి స్థలం: మహబూబ్ నగర్

జడ్చర్లలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. ముందుగా రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.