పేద కుటుంబాలకు ఊరట: పలాసలో గృహ మంజూరు ఉత్తర్వులు అందజేత

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరో ముందడుగు పడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 77 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.