అనంతపురంలో దారుణం: పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై గొడ్డలితో దాడి

రిపోర్టర్: గోపి స్థలం: Anantapur

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని గోపికపై దుండగుడు చైన్సా తో అతి దారుణంగా దాడి చేసినట్లు ఉపాధ్యాయురాలు రాజేశ్వరి వెల్లడించారు. తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న సమయంలో ఈ భయానక ఘటన జరిగిందని, తనను కాపాడబోయిన మరో విద్యార్థిని లక్ష్మికి కూడా గాయాలయ్యాయని తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన బాధితురాలను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.