'పనికిరావు అనుకుని పడేశాం': విశాఖలో కరెన్సీ కలకలంపై తేల్చిన పోలీసులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద ₹500, ₹100, ₹50 నోట్లు కుప్పగా పడి ఉండటం కలకలం రేపింది. పార్క్ ఎదురుగా చినిగిపోయిన నోట్లు గుర్తించిన వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేజీహెచ్ ప్రాంతానికి చెందిన ఆదిమూలం సూర్యారావు ఈ నోట్లను పడేసినట్లు గుర్తించారు. ఇంట్లో అట్టపెట్టెలో దాచిన డబ్బులకు చెదలు పట్టడంతో పనికిరావు భావించి పార్క్ వద్ద పడేసినట్లు విచారణలో తేలింది.