సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో... అలా మొదలైంది' విడుదల

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ప్రేయసి రావే దర్శకుడు మహేష్ చంద్ర తెరకెక్కించిన తాజా చిత్రం 'పిఠాపురంలో… అలా మొదలైంది'. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని దర్శకుడు తెలిపారు.