మనవళ్లతో మాట్లాడేందుకు కేబీసీ వేదికపై జెన్ జీ పదాలు నేర్చుకున్న అమితాబ్

రిపోర్టర్: హరి స్థలం: ముంబై

మనవళ్లతో సరదాగా మాట్లాడేందుకు తాను జెన్ జీ భాషను నేర్చుకోవాలనుకుంటున్నట్లు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 18 షోలో పాల్గొన్న ఆర్య సహాని అనే కంటెస్టెంట్ ఆయనకు కొన్ని జెన్ జీ పదాల అర్థాలను సరదాగా వివరించారు. లాక్ ఇట్ బదులు క్లాక్ ఇట్ అనడం, సస్పిషియస్ కు బదులు సస్ అనడం వంటి పదాలను నేర్చుకున్న అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందిస్తూ అందరినీ నవ్విస్తూ సందడి చేశారు.