పెబ్బేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రామన్న ర్యాలీ

రిపోర్టర్: హరి స్థలం: పెబ్బేరు, వనపర్తి జిల్లా

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రామన్న ర్యాలీ నిర్వహించారు. సబ్‌స్టేషన్‌ నుంచి సుభాష్‌ చౌరస్తా వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసనను, మద్దతును తెలిపారు.