పదిహేను లక్షలకు పైగా టికెట్లు విక్రయించినట్లు తెలిపిన చిత్రబృందం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాగా బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వేదికల ద్వారా ఈ సినిమా విడుదలకు ముందే పదిహేను లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్రబృందం వెల్లడించింది. దసరా సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.