ప్రవాస తెలుగుల కోసం గ్రాండ్ బోస్టన్ సూపర్ సింగర్ 2026 పోటీలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Boston

అమెరికాలోని ప్రవాస తెలుగుల కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో సూపర్ సింగర్ 2026 సంగీత పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై నవంబర్ 7వ తేదీన మసాచుసెట్స్లోని లెక్సింగ్టన్ కమ్యూనిటీ సెంటర్లో వివిధ విభాగాల్లో గాన పోటీలు జరగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.