'బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్': పోలీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపం వద్ద ఆడుకుంటున్న ఓ బాలికను మాయమాటలతో ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు జాదవ్ బిక్కును పోలీసులు అరెస్ట్ చేశారు. భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి నిందితుడిని భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.